హైదరాబాద్ : యునెటెడ్ స్టేట్స్ యందు ప్రధాన కార్యాలయం కలిగియుండి, ప్రపంచ
డిజిటల్ సేవల అగ్రగామి కంపెనీ అయిన ఇన్ఫోవిజన్ ఐఎన్సి, ప్రత్యేకించి పరిశ్రమ
విద్యాసంస్థల మధ్య సన్నిహిత సంబంధాలు మరియు గొప్పదైన సమన్వయమును ఏర్పరచడానికై
సమన్వయ అంశాలను నెలకొల్పడానికి గాను ఐఐటి-హైదరాబాదుతో ఒక అవగాహనా ఒప్పందాన్ని
కుదుర్చుకొంది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) చొరవ కార్యక్రమాలలో
భాగంగా, రెండు కొత్త హైబ్రిడ్ తరగతి గదులను ప్రారంభించడానికి గాను ఐఐటి
హైదరాబాద్ అధికారులతో భాగస్వామ్యాన్ని ఖరారు చేసుకోవడానికి ఇన్ఫోవిజన్
అధ్యక్షులు సియాన్ యలమంచి ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ సందర్శించారు. “డిజిటైజేషన్
దిశగా నిర్ణయాత్మకమైన, ప్రభావపూరితమైన చొరవను ఐఐటి వంటి ప్రతిష్టాత్మక విద్యా
సంస్థ తీసుకోవడం చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉందని ఇన్ఫోవిజన్
సహ-వ్యవస్థాపకులు, అధ్యక్షులు, బోర్డు సభ్యులు సియాన్ యలమంచి అన్నారు.
వినూత్న ఆవిష్కరణ మరియు ఆర్థిక ఎదుగుదలను ముందుకు నడపడానికై ప్రాజెక్టులు,
ఇంటెర్న్షిప్లు, శిక్షణా కార్యక్రమాలు, టెక్నాలజీ సక్రియతకు ప్రాప్యతతో సహా
విద్యార్థులు, ఇన్ఫోవిజన్ ఇంజనీర్లకు విస్తృతమైన రీతిలో అవకాశాలను
అందించడానికి గాను ఈ అవగహనా ఒప్పందము రూపొందించబడింది. “మా బలాల యొక్క ఈ
సమ్మిళితం పరిశ్రమ మరియు విద్యా సంస్థల మధ్య ఖాళీని భర్తీ చేయడానికి
సహాయపడుతుంది, అది తిరిగి విద్యా విషయక పరిశోధన మరియు విద్య అనేవి, నిజమైన
ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాల వృద్ధికి దారితీసేలా
పరిశ్రమ యొక్క అవసరాలతో సర్దుకుంటాయి. విద్యార్థులకు స్వీయ-అనుభవం,
పరిశ్రమ-గ్రాహ్యతలు, మరియు కెరీర్ అవకాశాలను కల్పించడం ద్వారా వారిని తయారు
చేయడంలో ఇది గణనీయమైన పాత్రను పోషిస్తుందనే ఆత్మ విశ్వాసం నాకుంది,” అని
జోడించారు సియాన్.“తమ అత్యుత్తమ సామర్థ్యాలను ఉపయోగించుకొని అసాధారణమైన
విలువను సృష్టించుటలో పరిశ్రమ యొక్క ఆసక్తిని విద్యాసంస్థ స్వాగతిస్తోంది,
అభినందిస్తోంది. వారి ముందస్తు చొరవ మరియు విధానం పట్ల మేము ఇన్ఫోవిజన్ వారికి
కృతజ్ఞులమై ఉన్నాము, జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా విద్యార్థులకు ఉన్నత నాణ్యత
గల విద్యను అందించుటలో మాకు సహాయపడేందుకు అది ప్రస్తుతమున్న వ్యవస్థకు
చేదోడుగా ఉంటుందన్నారు ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ డా.మూర్తి. ఒప్పందములో
భాగంగా, ఇన్ఫోవిజన్ ఇంజనీర్లు సాంకేతిక విషయ పరిజ్ఞాన నిపుణులు అత్యాధునిక
సాంకేతికతలపై ఐఐటి హైదరాబాద్ వారి అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది,
ప్రతిభావంతులైన విద్యార్థులతో సమన్వయం చేసుకోవడానికి తమ నిబద్ధతను
వ్యక్తపరచారు. టెక్నాలజీ ల్యాబ్ సందర్శనలు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు,
అతిథి ఉపన్యాసాలు, మినీ ప్రాజెక్టులు, ఇంటెర్న్షిప్, మొదలగు వంటి అంశాలలో
పరస్పర ప్రయోజనం, ఎదుగుదల కొరకు అనుభవాన్ని పంచుకోవడం దీని లక్ష్యంగా ఉంది.