హైదరాబాద్ : రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ కానున్న మూడు
స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఎమ్మెల్యేల
కోటా నుంచి ఎన్నికైన ఎ.కృష్ణారెడ్డి, వి.గంగాధర్‌గౌడ్, కె.నవీన్‌కుమార్‌ల
పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. ఆయా స్థానాల భర్తీ కోసం మార్చి 6 నుంచి
నామినేషన్లు స్వీకరిస్తారు. 13 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఉపసంహరణకు
16వ తేదీ చివరి గడువు. మార్చి 23న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి
సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
చేపట్టాలని ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్లో పేర్కొన్నారు.