హైదరాబాద్: లాసెట్, ఈసెట్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 2వ తేదీ నుంచి
ప్రారంభం కానుంది. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రెండు ప్రవేశ
పరీక్షల షెడ్యూల్‌ను ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, ఓయూ ఉప కులపతి, ఆయా
ప్రవేశ పరీక్షల ఛైర్మన్ ఆచార్య రవీందర్ విడుదల చేశారు. లాసెట్‌కు దరఖాస్తు
రుసుం ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు రూ.600, ఇతరులకు రూ.900గా నిర్ణయించారు.
పీజీ లాసెట్‌కు వరుసగా రూ.900, రూ.1,100 ఫీజు ఉంటుంది. పాలిటెక్నిక్,
బీఎస్సీ గణితం పూర్తిచేసిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా
బీటెక్, బీఫార్మసీలో ప్రవేశానికి నిర్వహించే ఈసెట్‌కు దరఖాస్తు రుసుం ఎస్సీ,
ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.900గా నిర్ణయించారు. విద్యార్థులు
చివరి తేదీ వరకు వేచి ఉండకుండా మొదట్లోనే దరఖాస్తు చేసుకొని ప్రవేశ పరీక్షలకు
సన్నద్ధం కావాలని లింబాద్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి
ఉపాధ్యక్షుడు ఆచార్య వి.వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు, లాసెట్
కన్వీనర్ ఆచార్య బి.విజయలక్ష్మి, ఈసెట్ కన్వీనర్ ఆచార్య శ్రీరాం వెంకటేష్
పాల్గొన్నారు.నేడు ఐసెట్ షెడ్యూల్ విడుదల

కేయూ క్యాంపస్ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కాకతీయ
విశ్వవిద్యాలయం నిర్వహించనున్న ‘టీఎస్ ఐసెట్-2023’ షెడ్యూల్‌ను మంగళవారం
విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్, కేయూ వాణిజ్యశాస్త్రం ఆచార్యురాలు
పి.వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు.