కుమార్తె బతుకుతుందనే ఆశలు కనిపించడం లేదని ప్రీతి తండ్రి నరేంద్ర వాపోయారు.
వరంగల్ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి మొదటి రోజుతో
పోలిస్తే మరింత క్షీణించిందని ఆమె తండ్రి నరేంద్ర తెలిపారు. నిమ్స్ వద్ద
ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
వైద్యులు వెంటిలేటర్‌పై
ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ తమ కుమార్తె బతుకుతుందనే ఆశలు కనిపించడం
లేదని వాపోయారు. ప్రీతి శరీరం రంగు కూడా మారిపోతోందన్నారు. వైద్యులు మెరుగైన
చికిత్స అందిస్తారని ఆశించినప్పటికీ అలాంటి పరిస్థితి కనిపించలేదన్నారు. ఏదైనా
అద్భుతం జరుగుతుందేమోనని ఆశించాం. కానీ, ఆశలు వదిలేసుకున్నాం. ప్రీతి ఆరోగ్యం
ఏమాత్రం మెరుగుపడలేదు. బతికే అవకాశాలు లేవని వైద్యులు కూడా చెప్పారని
వెల్లడించారు. ఆదివారం పలువురు రాజకీయ నేతలు నిమ్స్ ఆసుపత్రికి వచ్చి ప్రీతి
ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ప్రీతి తల్లిదండ్రులను పరామర్శించిన
వారిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ మాలోతు కవిత తదితరులు ఉన్నారు. మరో
వైపు ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిమ్స్‌లో విద్యార్థి
సంఘాలు ఆందోళనకు దిగాయి. వైద్య విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం రూ.5కోట్ల
పరిహారం ఇవ్వాలని, ప్రిన్సిపల్, హెచ్‌వోడీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్
చేశాయి.నా మనసును తీవ్రంగా కలిచి వేసింది: హరీశ్‌రావు
మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరం. ఆమెను
కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా
శ్రమించింది. పూర్తి అరోగ్యవంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి
తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసింది. ప్రీతి
ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు నా
ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా
ఉంటుంది’’ అని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి : ఈటల రాజేందర్
హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని
ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వైద్యులను
అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వెళ్లిన ఈటల అక్కడ మీడియాతో మాట్లాడారు.
వరంగల్ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై రాష్ట్ర
ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్
చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీతికి మెరుగైన వైద్యం
అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం నిమ్స్
ఆస్పత్రికి వెళ్లిన ఈటల ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి
తెలుసుకున్నారు.