హైదరాబాద్ : ఇన్నోవేషన్ .. ఇన్ఫాస్ట్కక్చర్.. ఇన్‌క్లూజివ్ గ్రోత్.. ఈ మూడూ
అంశాలు దేశాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు ఎంతో ప్రభావితం చేస్తాయని రాష్ట్ర
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ వేదికగా హెచ్ఐసీసీలో
జరుగుతున్న బయో ఆసియా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆదివారం వరకు జరిగే ఈ
సదస్సులో ఇవాళ పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు
కుదుర్చుకున్నాయి. పలు అంకుర సంస్థలకు మంత్రి చేతులు మీదుగా అవార్డులు ప్రదానం
చేశారు.
హైదరాబాద్ వేదికగా హెచ్ఐసీసీలో జరుగుతున్న బయో ఆసియా సదస్సు రెండో రోజు
విజయవంతంగా ముగిసింది. ఆదివారంతో ముగియనున్న ఈ సమావేశాల్లో ఇవాళ రాష్ట్ర
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రానున్న రోజులల్లో మరిన్ని
ఆవిష్కరణలను తీసుకురావాలని ఆశిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఇన్నోవేషన్.. ఇన్ఫ్రాస్ట్రక్చర్.. ఇన్‌క్లూజివ్ గ్రోత్.. ఈ మూడూ అంశాలు
దేశాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు ఎంతో ప్రభావితం చేస్తాయని మంత్రి
పేర్కొన్నారు. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా డేటా ఎనలిటిక్స్,
ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్, అంతర్జాతీయ సప్లే చైన్ వంటి అంశాలపై చర్చ
కార్యక్రమాలు జరిగాయి. లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన అభ్యాసాలు, సవాళ్లు,
అవకాశాలపై జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు చర్చించారు. కార్యక్రమంలో పాల్గొన్న
జీవన్ సైంటిఫిక్ టెక్నాలజీ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ రవీందర్ తంగళ్లపల్లి
భవిష్యత్తులో లైఫ్ సైన్సెస్ రంగంలో రానున్న సాంకేతికతలు, ఇంటిగ్రేటెడ్ హెల్త్
కేర్ మోడల్స్ వంటి అంశాలపై ఏర్పాటు చేసిన చర్చ సమావేశాలు విద్యార్థులకు ఎంతో
ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రెండో రోజు పలు సంస్థలు తెలంగాణ
ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్
సంస్థ ఫ్లాండర్స్ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో క్లస్టర్ టు క్లస్టర్
కొలాబరేషన్స్ చేస్తూ లైఫ్ సైన్సెస్ విశ్వ విద్యాలయంతో భాగస్వామ్యం
కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ హెల్త్ కేర్ సంస్థ సొనాఫీ
హైదరాబాద్‌లో గ్లోబల్ మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
రెండు రోజులుగా జరుగుతున్న ఈ సదస్సులో స్టార్ట్ ఎక్స్‌పోలో 76 అంకుర సంస్థలు
పాల్గొనగా టాప్ 5 అంకురాలకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.
వైకల్యం ఉన్నవారికి లేదా ప్రమాదంలో చేతులు పోగొట్టుకున్న వారికి కృత్రిమ
చేతులను తయారు చేసిన ఎక్స్ బాట్ డైనమిక్స్ అంకుర సంస్థ వ్యవస్థాపకుడు మనీష్
కుమార్‌కు బెస్ట్ స్టార్టప్ అవార్డు అందజేశారు. ల్యాంబ్ డేగన్ థెరప్యూటిక్స్
సంస్థ రెండవ స్థానంలో, ప్రతిభ హెల్త్ కాన్ మూడో స్థానంలో, రాంజీ జెనో సెన్సార్
నాలుగో స్థానంలో, సత్య ఫార్మా సంస్థ ఐదో స్థానంలో నిలిచాయి. ఈ కార్యక్రమానికి
పెద్ద సంఖ్యలో శాస్త్రవేత్తలు, పలు విద్యా సంస్థల ప్రముఖులు పాల్గొన్నారు.