హైదరాబాద్ : భారత్ బయోటెక్ గ్రూపు సంస్థ జంతు టీకాలు, మందుల కోసం
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయోవెట్ రేబిస్ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు
కుక్కలకు ఇచ్చే టీకాను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు చేపట్టిందని భారత్
బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
డి.సాయిప్రసాద్ తెలిపారు. ఇక్కడ ప్రారంభమైన ‘బయో ఆసియా 2023’ చర్చాగోష్ఠిలో
ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కుక్కకాటుతో రేబిస్ సోకి మన దేశంలో ఏటా 25,000
మందికి పైగా చనిపోతున్నందున, సాధ్యమైనంత త్వరగా ఈ టీకాను ఆవిష్కరిస్తామని
సాయిప్రసాద్ తెలిపారు. బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న
బయోవెట్ ఇప్పటికే ఈ ప్రాజెక్టును చేపట్టిందని చెప్పారు. పెంపుడు కుక్కలు,
వీధికుక్కలు సహా వేటికైనా వినియోగించే టీకా దిశగా పరిశోధనలు
సాగుతున్నాయన్నారు. వచ్చే రెండేళ్లలో ఈ టీకాను ఆవిష్కరించాలనేది తమ ఆలోచనని
ఆయన వెల్లడించారు.