రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం
కేంద్ర మంత్రి గంగాపురం కిషన్రెడ్డి వెల్లడి
హైదరాబాద్ : తెలంగాణలో రూ.10,578 కోట్ల అంచనా వ్యయంతో మరో గ్రీన్ఫీల్డ్
ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి
జి.కిషన్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకుఆయన ట్వీట్ చేశారు. నాలుగు వరసల్లో
నిర్మించే ఈ జాతీయ రహదారి మంచిర్యాల జిల్లా అన్నారం గ్రామంలో ప్రారంభమై
అసిఫాబాద్ జిల్లాలోని వీరవెల్లి గ్రామం మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి
జిల్లా వరకు 63 కిలోమీటర్ల మేర సాగుతుందని తెలిపారు.