తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : నూతన ఆవిష్కరణలతో సమస్యల పరిష్కారదిశగా యువతను ప్రోత్సహించేందుకు
యునిసెఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా వై-హబ్ నెలకొల్పనున్నట్లు
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కేంద్రం ద్వారా సమస్యల పరిష్కారం, వినూత్న
ఆలోచన, డిజైన్ రూపకల్పన, 21వ శతాబ్ద నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణలతో యువత
పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సాహం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
వై-హబ్ నెలకొల్పేందుకు వీలుగా స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ (ఎస్వోఐ)పై
తెలంగాణ ప్రభుత్వం, యునిసెఫ్ ఇండియా, యువాహ్ సంస్థల ప్రతినిధులు సంతకాలు
చేశాయి. యువ ఆవిష్కర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇన్నోవేషన్,
ఇంక్యుబేషన్ హబ్‌గా ఇది ఉంటుందని యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా మెకఫ్రే
తెలిపారు. ఈ సమావేశంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, తెలంగాణ చీఫ్
ఇన్నోవేషన్ అధికారి డాక్టర్ శాంత, టీఎస్ఐసీ ప్రతినిధి అపూర్వ భాస్కర్
తదితరులు పాల్గొన్నారు.
అకడమిక్ గ్రాండ్ ఛాలెంజ్ ప్రతిభావంతులకు ఉద్యోగాలు : వెల్స్‌ఫార్గో
తెలంగాణ ఏఐ మిషన్, వెల్స్‌ఫార్గో సంయుక్తంగా నిర్వహించిన అకడమిక్ గ్రాండ్
ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రతిభ చూపిన అభ్యర్థుల జాబితా వెల్లడైంది. ఈ పోటీలో
గెలుపొందిన వారికి ఉద్యోగ ఆఫర్లు, నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు
వెల్స్‌ఫార్గో వెల్లడించింది. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 500కు పైగా కళాశాలల
నుంచి అయిదు వేల బృందాలు పాల్గొన్నాయి. ఇందులో ఎస్ఆర్ఎం కళాశాలకు చెందిన
రెండు విద్యార్థి బృందాలు టాప్ అవార్డులు అందుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన
ఆన్లైన్ సమావేశంలో వెల్స్‌ఫార్గో ఇండియా, ఫిలిప్పైన్స్ ఎండీ అరిందమ్
బెనర్జీ, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ విద్యార్థులను అభినందించారు.