చేయించుకోవాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సివస్తోంది. అలాంటి అన్నిరకాల
రక్తపరీక్షల్ని ఉచితంగా చేస్తూ పేదరోగులకు అండగా నిలుస్తున్న మహబూబ్‌నగర్ జనరల్
ఆసుపత్రి. మెరుగైన సేవలందించిన నేపథ్యంలో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ మరో
గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ పరీక్షిస్తున్న ల్యాబ్‌లకు జాతీయ స్థాయి
గుర్తింపు నిచ్చే నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఎంట్రీలెవల్ గుర్తింపు నిచ్చింది.
ఎన్ఏబీఎల్ పంపిన నమూనాలను కచ్చితత్వం, నాణ్యతతో పరీక్షించి ఫలితాలు
వెల్లడించడంతో ఈ గుర్తింపు దక్కింది. మూడేళ్ల పాటు ఈ గుర్తింపు కొనసాగనుంది.మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్‌కు
జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. వ్యాధినిర్థారణ పరీక్షల్లో కచ్చితమైన
ఫలితాలతో పాటు, నాణ్యమైన సేవలు అందిస్తున్నారని టెస్టింగ్ ల్యాబ్, కాలిబ్రేషన్
ల్యాబ్‌ల జాతీయ అక్రిడేషన్ బోర్డు ఎంట్రీ లెవల్ గుర్తింపు ఇచ్చింది. 2026
ఫిబ్రవరి 7 వరకు ఈ ప్రత్యేక గుర్తింపు కొనసాగనుంది.
తమిళనాడులోని వేలూర్ మెడికల్ సైన్స్ నుంచి బయోకెమిస్ట్రీ, మైక్రోబయోలజీ
విభాగాల నుంచి సిరాలజీ, వైరాలజీ నమూనాలు, దేశ రాజధాని దిల్లీ ఏయిమ్స్ నుంచి
సీబీపీ కోసం సమూనాలు పంపించింది. మహబూబ్‌నగర్‌లో వచ్చిన ఫలితాలను అంతకుముందే
వేలూర్ ఏయిమ్స్ వచ్చిన ఫలితాలతో సరిచూసుకుంది. పరీక్ష ఫలితాలు కచ్చితంగా
ఉండటంతో మహబూబ్‌నగర్‌లో నాణ్యమైన సేవలు అందిస్తున్నారని కేంద్ర సంస్థ
గుర్తించిందిమహబూబ్నగర్ జిల్లా టి-హబ్ డయాగ్నస్టిక్ కేంద్రానికి జిల్లా
వ్యాప్తంగా అన్ని పీహెచ్సీ, సీహెచ్‌సీ కేంద్రాల నుంచి రక్త నమూనాలు వస్తాయి.
వాటిని పరీక్షలు చేసి 24 గంటల్లో ఫలితాలను నేరుగా రోగులకు మొబైల్ నెంబర్లకు
పంపుతున్నారు. ఇప్పటి వరకు 3లక్షల 21వేల వైద్య పరీక్షలను నిర్వహించారు.
ప్రస్తుతం 47రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా, వాటిని వచ్చే నెల నుంచి
133కు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో రోగుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అత్యవసర సమయాల్లో చికిత్సకు
వచ్చిన వారి వద్ద ఎలాంటి ఆధారాలు గానీ పత్రాలు గానీ లేని వారికి కూడా పరీక్షలు
నిర్వహించి రోగులకు అండగా నిలుస్తున్నారు. రాబోయే రోజుల్లో కార్డియాలజీ,
రేడీయాలజీ, మామోగ్రఫీకి సంబంధించిన పరీక్షలు సైతం మహబూబ్ నగర్ లో అందుబాటులోకి
రానున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.మహబూబ్‌నగర్ జిల్లాను వైద్య పర్యాటక
కేంద్రంగా మార్చుతామని గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు మార్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ లో చేసిన పరీక్ష నివేదికలకు జాతీయ స్థాయిలో చెల్లుబాటు
అయ్యేలా గుర్తింపు రావడం, సేవల్ని మరింత విస్తరించడం పై వైద్యవర్గాల్లో సంతోషం
వ్యక్తమవుతోంది.