హైదరాబాద్ : ప్రముఖ సినీనటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న
భౌతికకాయానికి ఎంపీ విజయసాయి రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన మృతిపై సంతాపం
వ్యక్తం చేశారు. తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని అన్నారు. గత కొన్ని
రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న శనివారం
రాత్రి కన్నుమూశారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ
దురదృష్టవశాత్తూ విఫలమయ్యాయి. తారకరత్న పార్థివదేహాన్ని హైదరాబాద్‌కు
తరలించారు. ఆయన మృతిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ
ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం
తారకరత్న పార్థివదేహాన్ని రేపు ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. సోమవారం సాయంత్రం
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.