వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా వరంగల్ లో క్రికెట్ టోర్నమెంట్ ను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ బుదవారం ప్రారంభించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ,ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సారధ్యంలో కెసిఆర్ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ కాకతీయ క్రికెట్ అకాడమీ, భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. కెసిఆర్ క్రికెట్ ఛాంపియన్ టోపీ కార్యక్రమాన్ని హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరము కేసీఆర్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం ప్రశంసనీయం అని అన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను ప్రదర్శించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి గెలుపోటములు సహజం కాబట్టి స్నేహపూర్వకంగా క్రీడలు ఆడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్ మానస రాంప్రసాద్, కాకతీయ క్రికెట్ అకాడమీ నాయకులు ఫరూక్ , విద్యార్థి నాయకులు బైరపాక ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.