చౌటుప్పల్ : మునుగోడు ఉప ఎన్నిక పోరు నరేంద్ర మోడీ , కేసీఆర్ మధ్యే జరుగుతుందని మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని తుప్రాన్పేటలో ప్రారంభించారు. దండుమల్కాపురంలో మంత్రి జగదీశ్ రెడ్డి, దేవలమ్మనాగారంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. 24 గంటల కరెంటు కావాలంటే తెరాసకు, 6 గంటల కరెంటు కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని సూచించారు. మోటార్లకు మీటర్లు పెడితే ఏం అవుతుందని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి అన్నారని గుర్తు చేశారు. వంట గ్యాస్‌ను, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఆర్మూర్, కోదాడ, నర్సాపూర్ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, చిలుముల మదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు గోద శ్రీరాములు, ఎండీ జహంగీర్, తెరాస రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సీపీఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్‌రెడ్డి, రిక్కల బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.