హైదరాబాద్ : శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండా
ప్రకాశ్‌ముదిరాజ్ ఏకగ్రీవమయ్యారు. ఈ పదవికి బండా ప్రకాశ్ అభ్యర్థిత్వాన్ని
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీంతో ఆయన తన
నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు అందజేశారు. నాలుగు
సెట్లుగా దాఖలు చేసిన నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు కే తారకరామారావు,
హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్,
మహమూద్ అలీ, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, రైతుబంధు సమితి
రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్
దాస్యం వినయభాస్కర్, శాసనమండలిలో విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీలు
సిరికొండ మధుసూదనాచారి, ఫారుక్‌హుస్సేన్, గంగాధర్‌గౌడ్, సురభి వాణీదేవి,
యెగ్గే మల్లేశం, తక్కళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, పాడి కౌశిక్‌రెడ్డి,
నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, దండె విఠల్, ఎల్ రమణ, అమినుల్ హసన్‌జాఫ్రీ,
ఎమ్మెల్యేలు డాక్టర్ టీ రాజయ్య, నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ఎల్పీ
కార్యదర్శి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ చైర్మన్ పదవికి శనివారం నామినేషన్ల గడువు ముగియగా ఒకే ఒక్క
నామినేషన్ దాఖలైంది. దీంతో బండా ప్రకాశ్ ఎన్నిక ఏకగ్రీవం అయినట్టే. అయితే
షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బండా ప్రకాశ్‌కు ఎన్నిక నియామక
పత్రం అధికారికంగా అందజేయనున్నారు. ఆ వెంటనే ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించే
అవకాశం ఉన్నది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్ ప్రస్తుతం
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ ఎండోమెంట్ లెక్చర్ కమిటీకి
శాశ్వత కార్యదర్శిగా, జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా
వ్యవహరిస్తున్నారు. గతంలో మూడుసార్లు జూడో అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడిగా
పనిచేశారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన బండా ప్రకాశ్..
రాష్ట్ర ఆవిర్భావం తరువాత సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు
ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆయనకు సీఎం కేసీఆర్ రాజ్యసభ
సభ్యుడిగా అవకాశం కల్పించారు. రెండున్నరేండ్లపాటు ఎంపీగా కొనసాగారు. సీఎం
కేసీఆర్ బండా ప్రకాశ్ సేవలను రాష్ట్రంలో వినియోగించుకోవాలని భావించి, ఆయనకు
ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు.