హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం
తెలంగాణ అగ్రి సైంటిస్ట్ అసోసియేషన్ (టాసా) రూపొందించిన 2023 సంవత్సరపు డైరీ,
క్యాలెండర్ ను వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి గురువారం
ఆవిష్కరించారు. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ కళాశాల ప్రాంగణంలోని ఆడిటోరియంలో
ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన తర్వాత
మాట్లాడారు. రైతు అందరికన్నా గొప్ప శాస్త్రవేత్త అని రైతు అనుభవాన్ని వ్యవసాయ
శాస్త్రవేత్తలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో అనేక రంగాలు
వడిదుడుకులకు గురైనా, కేవలం వ్యవసాయ రంగం మాత్రమే దేశంలోని ప్రజలందరికీ తిండి
పెట్టిందని అందుకు మనమంతా రైతుల కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నారు. త్వరలోనే
వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి ఏర్పాటు చేస్తామని ఇందుకు సంబంధించిన
కసరత్తు జరుగుతొందని అన్నారు. అలాగే ‘టాసా’ ప్రస్తావించిన 2016 యూ.జి.సి
పేరివిజన్ కు సంబంధించిన ఏరియర్స్ విడుదల సంభందించీ ఆర్థిక శాఖ మంత్రి తో
మాట్లాడి ఏరియర్స్ విడుదల చేసేలా కృషి చేస్తానని హమీ ఇచ్చారు. ‘టాసా’
ప్రతినిధులు ప్రస్తావించిన పలు అంశాలపై కూడా ఆయన సానుకూలంగా స్పందించారు.
అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చెస్థానన్నారు. ఈ అంశాలను పరిష్కరించడానికి
సంబంధిత అధికారులతో మాట్లాడతానని అన్నారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్
డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్, విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు డాక్టర్
జగదీశ్వర్, డాక్టర్ సీమ, డాక్టర్ జగన్మోహన్ రావు, అసోసియేట్ డీన్ డాక్టర్
నరేంద్రా రెడ్డి, ‘టాసా’ అధ్యక్షుడు, డాక్టర్ బి. విద్యాసాగర్, కార్యదర్శి
డాక్టర్ రజనీకాంత్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ పవన్ చంద్రారెడ్డి, పెద్ద
సంఖ్యలో శాస్త్రవేత్తలు, విద్యార్థులు హాజరయ్యారు.