హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలను ఆధునీకీకరణ చేసేందుకు మన ఊరు మన బడి
పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 684 పాఠశాలలను మొదటి విడతలో భాగంగా
ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు మన బడి మొదటి విడతలో పనులు పూర్తయిన
పాఠశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కేజీ టూ పీజీ
క్యాంపస్ ప్రారంభోత్సవంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి
పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆధునికీకరించిన 684 బడులు గురువారం
ప్రారంభమయ్యాయి. మొదటి విడతలో ఇప్పటి వరకు సుమారు 1200 పాఠశాలలను
తీర్చిదిద్దినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మూడేళ్లలో
మూడు దశల్లో రాష్ట్రంలోని 26,055 పాఠశాలల రూపురేఖలు మార్చనున్నట్లు సబితా
ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మొదటి దశలో రూ.9,123 కోట్లలతో 3,497 బడులను
ఆధునికీకరణ చేస్తున్నట్లు మంత్రి వివరించారు.కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా
సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు 12 రకాల సదపాయాలను మెరుగుపరుస్తున్నట్లు
సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. భవనాలకు మరమ్మతులు, రంగులు వేయడం, ప్రహరీ గోడల
నిర్మాణం, తాగునీరు, టాయిలెట్ల నిర్మాణం, అదనపు తరగతి గదులు, లైటింగ్, భోజన
వసతి ఏర్పాట్లు, గ్రీన్ బోర్డులు, డిజిటల్ తరగతులు తదితర పనులు చేపట్టారు.