హైదరాబాద్ : నగరంలో పెద్ద ఎత్తున ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. ప్రముఖ
స్థిరాస్తి రంగ సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది. స్థిరాస్తి రంగ సంస్థ
డైరెక్టర్లు, సీఈవోల కార్యాలయాలు, ప్రతినిధుల ఇళ్లు, ప్రధాన సంస్థ అనుబంధ
సంస్థల కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేపీహెచ్బీలోని లోధా
అపార్ట్మెంట్స్లోని ఊర్జితా కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీనివాస రెడ్డి,
శ్రీఆదిత్య హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ కోటారెడ్డి, అతని కుమారుడు
ఆదిత్య రెడ్డి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో
సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 50 ఐటీ బృందాలు సోదాల్లో పాల్గొన్నట్లు
సమాచారం. ఐటీ రిటర్న్స్ దాఖలులో అవకతవకలు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది.
గడిచిన ఐదేళ్లలో ఐటీ రిటర్న్స్ వివరాలను అకౌంట్స్ విభాగం నుంచి తీసుకున్న
ఐటీశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.