హైదరాబాద్ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు
చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కేజ్రీవాల్‌కు ఘన స్వాగతం పలికాయి. కాగా
బుధవారం ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభ కోసం సీఎం కేసీఆర్ కేజ్రీవాల్‌ను
ఆహ్వానించారు. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ
కార్యకర్తలను, నేతలను కలిశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
కేజ్రీవాల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల కోసం రాలేదు. కంటి
వెలుగు మంచి కార్యక్రమం కాబట్టే ఇక్కడికి వచ్చామన్నారు. తెలంగాణలో ఆప్
నిర్మాణం కోసం కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి
కృషిచేయాలన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని
స్పష్టం చేశారు.