హైదరాబాద్ : పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో
21 టిక్కెట్ కౌంటర్లను ద.మ. రైల్వే ప్రారంభించింది. సాధారణ రోజుల్లో 12
మాత్రమే ఉండేవి. అదనపు సిబ్బందిని నియమించామని ద.మ. రైల్వే ముఖ్య ప్రజా
సంబంధాల అధికారి సీహెచ్ రాకేష్ తెలిపారు. రైళ్లు ఏ సమయానికి, ఏ
ప్లాట్‌ఫామ్‌కు వస్తాయనేది ఎప్పటికప్పుడు ప్రకటించడమే కాకుండా సహాయకులను
అదనంగా సమకూర్చామన్నారు. టిక్కెట్ తనిఖీ సిబ్బందిని 20 నుంచి 40కి
పెంచామన్నారు. టిక్కెట్ తనిఖీ సిబ్బందిని రెట్టింపు చేశామన్నారు. 60 మంది
ఆర్పీఎఫ్ సిబ్బంది, 30 మంది జీఆర్పీ నిత్యం విధుల్లో ఉండేలా
చూస్తున్నామన్నారు.
13, 14 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు : ఈ నెల 13, 14 తేదీల్లో పలు
ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక
ప్రకటనలో తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్-లింగంపల్లి మధ్య 5 సర్వీసులను,
ఫలక్‌నుమా-లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య 11 సర్వీసులను,
హైదరాబాద్-ఫలక్‌నుమా-హైదరాబాద్ మధ్య ఒక రైలు సర్వీసును రద్దు చేసినట్లు
పేర్కొంది.