విజయవాడ : తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను ఏపీ కేడర్‌కు కేటాయించినందు వల్ల అక్కడే విధులు నిర్వహించాలని కోర్టు పేర్కొంటూ తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది. ఈ క్రమంలో మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఏపీలో రిపోర్ట్ చేశారు. గురువారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలో సోమేశ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీకి వచ్చాను. నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తాను. ఒక అధికారిగా డీవోపీటీ ఆదేశాలు పాటిస్తున్నాను. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తాను. వీఆర్ఎస్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కుటుంబ సభ్యులతో చర్చించాక చెబుతానని స్పష్టం చేశారు.
సిఎస్.డా.జవహర్ రెడ్డిని కలిసిన సోమేశ్ కుమార్
అమరావతి : డిఓపిటి ఆదేశాలు మేరకు ఎపి కేడర్ కు వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ గురువారం ఉదయం విజయవాడ లోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డిని కలిశారు.