హైదరాబాద్ : సంక్రాంతి పండగ నేపథ్యంలో విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య
ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. జనవరి 11, 13, 16
తేదీల్లో విశాఖ నుంచి, 12, 14, 17 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి ఈ రైళ్లు
ప్రారంభమవుతాయి. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే
శుభవార్త చెప్పింది. ఇప్పటికే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్న
ఎస్సీఆర్.. తాజాగా విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపడాలని
నిర్ణయించింది. జనవరి 11 నుంచి 17 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.
జనవరి 11న రాత్రి 7.50 గంటలకు విశాఖలో బయలు దేరిన ప్రత్యేక రైలు (08505)
మరుసటి రోజు ఉదయం 7.10కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. జనవరి 11, 13, 16
తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. మరోవైపు జనవరి 12, 14, 17 తేదీల్లో
సికింద్రాబాద్ నుంచి రాత్రి 7.40కి బయలుదేరిన ప్రత్యేక రైలు (08506) తర్వాతి
రోజు ఉదయం 8.20కి విశాఖ చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
మంగళవారం ఉదయం 8 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు.