వెండి చీర ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్
నేత కళాకారుడు నల్లా విజయ్‌కు అభినందనలు
హైదరాబాద్: సిరిసిల్ల నేత కళాకారుడు నల్లా విజయ్ నెలన్నర పాటు శ్రమించి
మగ్గంపై నేసిన సువాసనలు వెదజల్లే వెండిచీరను మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో
ఆవిష్కరించారు. విజయ్‌తో మాట్లాడి చీర తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. ఆయన
నైపుణ్యాన్ని అభినందించారు. తెలంగాణ నేతన్నల అనితర సాధ్యమైన, అద్భుతమైన
ప్రతిభకు వెండి చీర నిదర్శనమన్నారు. విజయ్‌కు అన్ని రకాల సహకరిస్తానని హామీ
ఇచ్చారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా,
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సాంకేతికత వినియోగంలో తెలంగాణ మేటి : డిజిటల్ భారత్-2022 పురస్కారాల్లో
తెలంగాణకు ‘గోల్డ్ ఐకాన్’ రావడంపై మంత్రి కేటీఆర్ ట్విటర్లో హర్షం
వ్యక్తం చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మరో గుర్తింపు అన్నారు.
దిల్లీలో రాష్ట్రపతి నుంచి పురస్కారాలు అందుకున్న రాష్ట్ర అధికారుల బృందానికి
అభినందనలు తెలిపారు.