మారిన చిరునామా : అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం వెల్లడి
హైదరాబాద్ : వీసా దరఖాస్తు కేంద్రం చిరునామా మారిందని హైదరాబాద్‌లోని
అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. వీసా దరఖాస్తుదారులు ఈ నెల
8 నుంచి హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్, లోయర్
కాన్కోర్స్లో కొత్త వీసా దరఖాస్తు కేంద్రాన్ని సందర్శించాలని కాన్స్లేట్
జనరల్ కార్యాలయం ట్విటర్లో పేర్కొంది. వీసా కోసం ముందుగా అపాయింట్మెంట్
తీసుకున్నవారితో పాటు డాక్యుమెంట్లు సమర్పించేందుకు, పాస్‌పోర్ట్‌లు తిరిగి
తీసుకోవాలనుకునే వారు కొత్త అడ్ర్సలోని వీసా దరఖాస్తు కేంద్రాన్ని
సందర్శించాల్సి ఉంటుంది.