హైదరాబాద్ : సీనియర్ పాత్రికేయుడు ఆలపాటి సురేశ్‌కుమార్ రాసిన వ్యాసాల
సంకలనం ‘రాజ్యం…మతం.. కోర్టులు..హక్కులు..!’ ఆవిష్కరణ సోమాజిగూడలోని
ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన
జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు
ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకం
హేతుబద్ధమైన తాత్విక ఆలోచనలు అందిస్తోందని, రచయిత ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే
ఉండాలని ఆకాంక్షించారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ
రాష్ట్రం మూడు ముక్కలు అయ్యేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఏపీ
హైకోర్టు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో ఆర్ఎస్ఎస్,
బీజేపీ ప్రజలకు సెక్యులరిజం అనే రక్షణను తొలగించే ప్రయత్నం
చేస్తున్నాయన్నారు. ఈ పుస్తకం ద్వారా ఆలపాటి సురేశ్ సమాజాన్ని మన ముందుంచే
ప్రయత్నం చేశారని సీనియర్ సంపాదకుడు ఆర్వీ రామారావు అన్నారు.
శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాల తీరు ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఇంట్లో
నుంచి బయటకు రావాలన్నా అనుమతి తీసుకోవాలేమోనని ఆందోళన వ్యక్తంచేశారు. పుస్తక
రచయిత మాట్లాడుతూ వ్యక్తిగత విభేదాలు లేకుండా ఓ వ్యక్తిని ద్వేషించడం మానసిక
జబ్బు అని, ప్రస్తుతం దేశంలో అదే జరుగుతోందన్నారు.