హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి
కేసీఆర్ జనవరి 18 నుండి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని
విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరు ప్రజాప్రతినిధుల
భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు సహా స్థానిక సంస్థలు, ఇతర ప్రజా ప్రతినిదులందరు ఇందులో
భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమంలో
అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలని, ఎక్కడా నిర్లక్ష్యం
వహించకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, ఆర్థిక,
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన కంటి వెలుగు సన్నద్ధత పై
ప్రారంభమైన మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు.
బీఆర్కె భవన్ నుండి మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్,
ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎస్ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, టి
ఎస్ ఎం ఎస్ ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ విభాగం
కమిషనర్ శ్వేత మహంతి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొనగా, వీడియో
కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుండి ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు,
పంచాయతీ, మున్సిపల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.అదే స్పూర్తితో రెండో దఫా కంటి వెలుగు ప్రారంభిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు
చెప్పారు. గ్రామ పంచాయితీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపుల నిర్వహణ
ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో అవసరం ఉన్న అందరికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు
నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్షల తో పాటు ఉచితంగా, మందులు, కళ్లద్దాలు
ఉచితంగా ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాల్లో ప్రభావవంతంగా
నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు.
మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండో విడత కంటి
వెలుగు కార్యక్రమం వంద వర్కింగ్ డేస్ లలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.
ఇందుకోసం కంటి వెలుగు కార్యక్రమంలో గతం కంటే టీమ్ లు పెంచిందన్నరు. ఉదయం 9 గంటల
నుండి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపులు నిర్వహణ ఉంటుంది అన్నారు. మెడికల్
ఆఫీసర్ ఆధ్వర్యంలో 8 మంది వైద్య సిబ్బంది ఉంటుందన్నారు. ఒక అప్టో మెట్రిస్ట్,
ఒక సూపర్ వైజర్, ఇద్దరు ఏ ఎన్ ఎం, ముగ్గురు ఆశా, 1 డీఈవో ఉంటారన్నారు.
ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ పూర్తి చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో

నమోదు అయ్యేలా అందరం కృషి చేద్దాం అనీ పిలుపునిచ్చారు.