హైదరాబాద్ : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు
సాగుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం
తెలిసిందే. తాజాగా బీజేపీ హైకమాండ్ తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు
పాలక్‌లను నియమించింది. తెలంగాణలో బీజేపీ సీనియర్లను సైతం పాలక్‌గా నియమిస్తూ
నిర్ణయం తీసుకుంది.ఇదిలా ఉండగా పాలక్‌లు ప్రతీ నెలలో మూడు రోజులు వారికి
కేటాయించిన నియోజకవర్గంలో పని చేయాలి. ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తల
బాగోగులు, ఆర్థిక వనరులు, కార్యక్రమాలల నిర్వహణ బాధ్యత అంతా వీరిపైనే ఉంటుంది.
– కుత్బుల్లాపూర్ – డీకే అరుణ
– ఎల్లారెడ్డి – రఘునందన్ రావు
– రామగుండం – కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
– కల్వకుర్తి – రామచంద్రా రావు
– వరంగల్ తూర్పు – ఈటల రాజేందర్
– ములుగు – సోయం బాపూరావు
– మేడ్చల్ – లక్ష్మణ్
– శేరిలింగంపల్లి – కిషన్ రెడ్డి
– పరిగి – విజయశాంతి.