హైదరాబాద్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నారు. మత్తు పదార్థాలు తయారుచేస్తున్నరెండు ల్యాబ్‌లపై సోమవారం దాడులు జరిపారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక సూత్రధారి రూ.60 లక్షలతో నేపాల్‌కు పారిపోతుండగా అధికారులు గోరఖ్‌పూర్‌లో పట్టుకున్నారు. డ్రగ్స్ తయారీ నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఒక ఫైనాన్షియర్ సహాయంతో హైదరాబాద్‌లో రెండు మెఫిడ్రాన్ తయారీ ల్యాబుల్లో ఎపిడ్రిన్ మత్తుపదార్థాన్ని తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు ఈ నెల 21 నుంచి డ్రగ్స్ తయారీ ముఠాపై నిఘా పెట్టారు. పూర్తి సమాచారం సేకరించి సోమవారం రెండు ల్యాబ్‌లపై దాడులు జరిపారు. డ్రగ్స్ తయారు చేస్తున్న ఏడుగురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.50 కోట్ల విలువైన 24.885 కిలోల ఎపిడ్రిన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీకి సహకరిస్తున్న కీలక సూత్రధారి, ఫైనాన్సియర్ రూ.60 లక్షల నగదుతో నేపాల్‌కు పారిపోతుండగా అధికారులు గోరఖ్‌పూర్‌లో అరెస్టు చేశారు. నిర్దిష్ట ఇంటెలిజెన్స్ హెచ్చరికను అనుసరించి, DRI డిసెంబర్ 21న వేగంగా, చక్కటి సమన్వయంతో కూడిన ఆపరేషన్‌ను ప్రారంభించి రెండు రహస్య ల్యాబ్‌లను ఛేదించింది. రెండు ప్రాంతాల్లో తయారు చేస్తున్న ఏడుగురిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. 60 లక్షల నగదుతో నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించిన గోరఖ్‌పూర్‌కు చెందిన ప్రధాన సూత్రధారి, ప్రధాన ఫైనాన్షియర్ పట్టుబడ్డాడు.
ఇండోర్‌లో 236 కిలోల ఎఫిడ్రిన్‌ను రహస్యంగా తయారు చేసిన 2016నాటి డిఆర్ఐ కేసు, యమునా నగర్లో 667 కిలోల మెఫెడ్రోన్‌ను రహస్యంగా తయారు చేసినందుకు జూలై 2022 డిఆర్ఐ కేసు, ఇండోర్ జైలు నుంచి తప్పించుకున్న కేసు, ఒక హత్య కేసు నిందితులు కూడా కొంతమంది ప్రస్తుతం పట్టుబడ్డ వారిలో ఉన్నారు.