చుక్కలెన్ని ఉన్నా తెలంగాణలో కేసీఆర్ ఒక్కరే
చంద్రబాబుపై కల్వకుంట్ల కవిత విమర్శ
కరీంనగర్ : టీడీపీ అధినేత చంద్రబాబుపై భారాస నేత, ఎమ్మెల్సీ కవిత
విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ రాజకీయాలు తెలంగాణలో సాగవని
విమర్శించారు. ఆకాశంలో చుక్కలెన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్టు తెలంగాణలో
కేసీఆర్ ఒక్కరే అని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు వచ్చి మళ్లీ ఇక్కడ పార్టీని
రివైవ్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్లు తెలంగాణ బాగును కోరిన వాళ్లు కాదు.
టీడీపీ ని ప్రజలు ఇప్పటికే రిజక్ట్ చేశారు. ఇప్పుడొచ్చి రాజకీయం
చేద్దామనుకున్నా మళ్లీ రిజక్ట్ చేస్తారని చెప్పారు.