సంతాపం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ
1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధంలో పోరాడిన బీఎస్ఎఫ్ జవాన్ లాన్స్‌నాయక్
భైరాన్‌సింగ్ రాథోర్(81) జోధ్‌పుర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన
మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సంతాపం తెలిపారు.
1971 భారత్-పాక్ యుద్ధంలో పోరాడిన బీఎస్ఎఫ్ జవాన్ లాన్స్‌నాయక్
భైరాన్‌సింగ్ రాథోర్(81) జోధ్‌పుర్ ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు.
భైరాన్‌సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలతో
పాటు భారత సరిహద్దు భద్రత దళం సంతాపం ప్రకటించింది. 1971 లాంగేవాలా యుద్ధంలో
అతని ధైర్యసాహసాలు గుర్తుచేసుకున్న బీఎస్ఎఫ్ దేశానికి సింగ్ ఎంతో సేవ చేశారని
కొనియాడింది. యుద్ధసమయంలో ఆయన జైసల్మేర్ థార్ ఎడారిలో బీఎస్ఎఫ్ యూనిట్
కమ్మాండింగ్ అధికారిగా పనిచేశారు. డిసెంబరు 5, 1971న దాడికి తెగించిన
పాకిస్థానీ బ్రిగేడ్, ట్యాంక్ రెజిమెంట్‌ను నాశనం చేయడంలో కీలకపాత్ర
పోషించారు. బీఎస్ఎఫ్ 14వ బెటాలియన్ పోస్టింగ్‌లో ఉన్న సమయంలో పంజాబ్
రెజిమెంట్‌పై పాకిస్థాన్ దాడిచేసింది. సింగ్ ఒక్కరే తుపాకీతో పాక్
సైనికులను అంతమొందించారు. భైరాన్ సింగ్ ధైర్యసాహసాల ఆధారంగా 1997లో సునీల్
శెట్టీ కథానాయకుడిగా “బార్డర్” చిత్రం తెరకెక్కింది. సింగ్ పార్థివ దేహానికి
అతని స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని బీఎస్ఎఫ్
తెలిపింది.