పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. వీరికి సంబంధించిన జాబితాను కూడా శాఖ
సిద్ధమైందని.. ఈ రేషన్ కార్డులు రద్దు చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఆదాయపు పన్ను చెల్లించే వారి పేర్లు లేదా 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారి
పేర్లు రేషన్ కార్డు నుంచి తీసివేయనున్నారు. అలాంటి వారికి ఇక నుంచి ఉచిత
రేషన్ అందదు. అదే సమయంలో ఉచిత రేషన్‌తో వ్యాపారం చేసేవారిని కూడా ప్రభుత్వం
గుర్తించింది. అదేవిధంగా నాలుగు నెలలపాటు రేషన్ తీసుకోని వారి కార్డులు కూడా
రద్దు చేసేందుకు రెడీ అవుతోంది. మొత్తం జాబితాను సిద్ధం చేసి.. రేషన్ డీలర్లకు
పంపనుంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనర్హుల పూర్తి జాబితాను డీలర్‌కు పంపుతామని
ప్రభుత్వం తెలిపింది. ఈ లిస్ట్ ఆధారంగా పేర్లు తొలగించిన వారికి డీలర్లు రేషన్
పంపిణీ చేయరు. డీలర్లు అనర్హుల పేర్లను గుర్తించి వారి నివేదికలను జిల్లా
కేంద్రానికి పంపుతారు. ఆ తర్వాత ఈ వ్యక్తుల కార్డులు రద్దు అవుతాయి.
80 కోట్ల మందికి లబ్ధి
ముఖ్యంగా దేశంలోని 80 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి
పొందుతున్నారు. అయితే కొంతమంది ఈ పథకాన్ని నకిలీ మార్గంలో ఉచితంగా రేషన్
పొందుతున్నారు. ఇటువంటి వ్యక్తుల పట్ల కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు కఠినంగా
వ్యవహరిస్తోంది. వారి కార్డులు రద్దు చేయడమే కాకుండా.. వారి ఇప్పటివరకు పొందిన
రేషన్ కూడా రికవరీ కూడా చేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో
నకిలీ పద్ధతిలో రేషన్ పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.