78 ఏళ్ల మోహన్‌సింగ్ రథ్వా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన క్రమంలో బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చోటా ఉదయ్‌పుర్(గిరిజన ప్రాతం) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఆయనకు మంచి పట్టుంది. 2012కు ముందు పావి జెట్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే, ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సంచలన ప్రకటన చేశారు రథ్వా. కానీ, ఆయన కుమారుడు రాజేద్రసింగ్ రథ్వాను తన స్థానంలో నిలబెట్టాలనుకున్నారు. తన నియోజకవర్గంలో సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.