ఆయన నివాసానికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి ద్రవపది ముర్ము దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్రపతితోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ్, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అద్వానీ నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు.