న్యూఢిల్లీ : ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారు. శనివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పొత్తులపై ఇప్పటికే రాష్ట్ర నేతల అభిప్రాయాలను అధిష్ఠానం తీసుకుందని తెలిపారు. ఏపీలో దొంగ ఓట్లు, ప్రజాసమస్యలపై బీజేపీ పోరాడుతుందన్నారు. పొత్తుల విషయం అధిష్ఠానం చూసుకుంటుందని, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే తమ బాధ్యత అని వివరించారు. బీజేపీ తరపున పోటీ చేసేందుకు చాలా దరఖాస్తులు వచ్చాయని, నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే అభ్యర్థుల విషయమై చర్చిస్తామని పేర్కొన్నారు.