న్యూఢిల్లీ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి సంసద్ మహారత్న( పార్లమెంటరీ మహారత్న) అవార్డు అందుకున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లకు ఏటా ఇచ్చే సంసద్ రత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో శనివారం జరిగింది. రవాణ, పర్యాటక సంస్కృతిక పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో ప్రతిష్టాత్మకమైన సంసద్ మహా రత్న అవార్డును అందుకున్నారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్ కూడా ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళ్ సై, హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, జాతీయ బిసి కమిషన్ చైర్మన్ హాన్స్ రాజ్ అహిర్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ అవార్డు గ్రహితలకు అవార్డులను అందజేశారు. 17వ లోక్ సభ కాలంలో టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అత్యుత్తమ పనితీరుకు గాను ఈ అవార్డు విజయసాయిరెడ్డి దక్కింది. సంసద్ రత్న, సంసద్ మహారత్న, సంసద్ ఉత్కృష్ట మహారత్న అవార్డులను పార్లమెంటు సభ్యులు అధిర్ రంజన్ చౌదరి, భతృహరి మహాతా, సుప్రియ సులే, శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే, హీనా గవిట్, జయంత్ సిన్హా, గద్ది గౌడ,సుధీర్ గుప్తా,అమోల్ రాంసింగ్ కొల్హే,రాజ్ శర్మ తదితరులు అవార్డులను అందుకున్నారు.