న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల
విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ‘ ది గవర్నమెంట్ ఆఫ్
నేషనల్ క్యాపిటల్ టెర్రిటొరీ ఆఫ్ దిల్లీ 2023’ బిల్లును కేంద్రం లోక్సభలో
ప్రవేశపెట్టింది. ఓవైపు మణిపుర్ అంశంలో ఉభయసభల్లోనూ ప్రతిష్టంభన పరిస్థితులు
కొనసాగుతుండగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీకి సంబంధించిన ఏ చట్టాన్నైనా రూపొందించే
అధికారాన్ని లోక్సభకు రాజ్యాంగం కల్పించిందని అన్నారు. అంతేకాకుండా చట్టాన్ని
తీసుకొచ్చే అధికారం కేంద్రానికి ఉందని సుప్రీం కోర్టు కూడా గతంలో స్పష్టం
చేసిందని చెప్పారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఢిల్లీప్రభుత్వం బిల్లును
అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని, ఈ బిల్లును తీసుకొచ్చేందుకు అనుమతించాలని
స్పీకర్ను కోరారు. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు
గుప్పిస్తున్నాయి. ఈ బిల్లును తీసుకురావడాన్ని సమాఖ్య విధానంపై దాడిగా
కాంగ్రెస్ అభివర్ణించింది. ‘ఢిల్లీ సర్వీసెస్ బిల్లు’ అప్రజాస్వామికమని,
సమాఖ్య విధానానికి విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ
కేసీ వేణుగోపాల్ విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు రాజ్యాంగ
విరుద్ధమని, సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఈ బిల్లును తీసుకొచ్చారని
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దేశంలో సమాఖ్య విధానంపై దాడి ఆమోదయోగ్యం
కాదని, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎంపీ మనోజ్ ఝా మండిపడ్డారు. ఇవాళ ఈ
ఢిల్లీపై దాడి జరుగుతోందని, రేపు ఏ రాష్ట్రంలోనైనా జరగొచ్చని ఆయన
వ్యాఖ్యానించారు.