న్యూఢిల్లీ : ఇండియా హౌస్‌లో భారతీయ అమెరికన్లతో మాట్లాడుతూ జిన రైమాండో
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల భారత పర్యటనకు
వచ్చిన అమెరికా వాణిజ్యశాఖ మంత్రి జిన రైమాండో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై
ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన గొప్ప దార్శనికుడని కొనియాడారు. దేశ ప్రజల
శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న కృషి అద్భుతమని ప్రశంసించారు. ఇండియా హౌస్‌లో
భారతీయ అమెరికన్లతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన
వీడియోను అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధు ట్విటర్లో ఆదివారం
పోస్ట్ చేశారు. దేశ ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేయాలన్న మోడీ తపన
సత్ఫలితాన్నిస్తోందని రైమాండో అన్నారు. భారత్‌ను అత్యున్నత దేశంగా
తీర్చిదిద్దాలనే ఆయన కల సాకారమవుతోందని వ్యాఖ్యానించారు.భారత పర్యటనలో దీనికి సంబంధించిన పురోగతిని తాను గమనించానని తెలిపారు. అలాగే
భారత్‌లో నిర్వహించే హోలీ పండుగలో పాల్గొన్నట్లు గుర్తుచేసుకున్నారు.
దానికోసమే తాను ఒకరోజు ముందు భారత్‌కు చేరుకున్నట్లు తెలిపారు. రక్షణ మంత్రి
రాజ్‌నాథ్ సింగ్ కుటుంబ సమేతంగా తనకు అద్భుతమైన ఆతిథ్యమిచ్చినట్లు
పేర్కొన్నారు. కృత్రిమ మేధలో వస్తోన్న విప్లవాన్ని భారత్, అమెరికా కలిసి
ముందుండి నడిపిస్తాయని రైమాండో ధీమా వ్యక్తం చేశారు. భారత పర్యటనలో ఆమె హోలీ
ఆడుతున్న వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
మరోవైపు అంతరిక్షం, రక్షణ, సెమీకండక్టర్లు, కొత్తతరం సాంకేతికతలపై కలిసి
పనిచేయడానికి ఈ ఏడాది ఆరంభంలో భారత్, అమెరికా సుముఖత వ్యక్తం చేసిన విషయం
తెలిసిందే.