ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూ ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగించిన కరోనా వైరస్ మహమ్మారి
ఏపీపైనా పంజా విసిరింది. రాష్ట్రంలో 14 వేల మందికి పైగా కరోనాతో మృత్యువాత
పడ్డారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు దయనీయ స్థితిలో
చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం
చెల్లించడం లేదంటూ పల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టును
ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కరోనా మృతుల
కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.