గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ అమ్మాయి నిర్విరామంగా 8 గంటల పాటు ఈత కొట్టి
గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు సంపాదించింది. ఛత్తీస్‌గఢ్‌కు
చెందిన ఓ అమ్మాయి నిర్విరామంగా 8 గంటల పాటు ఈత కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్
వరల్డ్ రికార్డ్సులో చోటు సంపాదించింది. దుర్గ్ జిల్లాలోని పురాయి
గ్రామానికి చెందిన 15 ఏళ్ల చంద్రకళ ఓజా ఈ ఘనత సాధించింది. ఆమె ఆదివారం
తెల్లవారుజామున అయిదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్విరామంగా ఈత
కొట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి తామ్రధ్వాజ్ సాహూ కూడా
హాజరయ్యారు. చంద్రకళ 8 గంటల పాటు చెరువులో 64 రౌండ్లు ఈత కొట్టింది. రికార్డు
సృష్టించిన ఆమె చెరువు నుంచి బయటకు రాగానే స్థానికులు అభినందనలు తెలిపారు.