ఇదో వింతైన రైల్వే స్టేషన్. టికెట్ కౌంటర్ మహారాష్ట్రలో ఉంటే స్టేషన్
మాస్టర్ మాత్రం గుజరాత్లో కూర్చుంటారు. నవాపుర్ రైల్వేస్టేషన్ ప్రత్యేకత
ఇది. ఎందుకంటే ఈ స్టేషన్ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల సరిహద్దులో ఉంది.
స్టేషన్లో కొంత భాగం మహారాష్ట్రలో ఉంటే మిగిలినది గుజరాత్లో ఉంటుంది. అదే
పశ్చిమ రైల్వే జోన్ పరిధిలో ఉన్న నవాపుర్ రైల్వే స్టేషన్. దేశంలో ఈ ఒక్క
రైల్వే స్టేషన్‌కే ఈ ప్రత్యేకత ఉంది. ఈ స్టేషన్ పొడవు 800 మీటర్లు. అందులో
500 మీటర్లు గుజరాత్‌లోని తాపి జిల్లాలో, మిగతా 300 మీటర్లు మహారాష్ట్రలోని
నందుర్బార్ జిల్లాలో ఉంటుంది. ఇక్కడ ఉన్న ఓ బెంచీలో సగ భాగం మహారాష్ట్రలో
ఉంటే మరో సగం గుజరాత్లో ఉంటుంది. బెంచీ మీద రెండు వైపులా రెండు రాష్ట్రాల
పేర్లుంటాయి. ఓ వైపు కూర్చుంటే మహారాష్ట్రలోనూ, మరోవైపు కూర్చుంటే
గుజరాత్‌లోనూ ఉన్నట్లన్నమాట. దీంతో చాలా మంది ప్రయాణికులు ఇక్కడ సెల్ఫీలు
దిగుతారు. బాంబే ప్రావిన్సుగా ఉన్నప్పుడు ఈ స్టేషన్‌ను నిర్మించారు. బాంబే
ప్రావిన్సును మహారాష్ట్ర, గుజరాత్‌లుగా విభజించిన తర్వాత సరిహద్దులో ఉన్న ఈ
స్టేషన్‌ను రెండు రాష్ట్రాలూ పంచుకున్నాయి.