న్యూఢిల్లీ : సామాజిక న్యాయాన్ని బిజెపి ఖూనీ చేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి
ఎంకె స్టాలిన్ విమర్శించారు. ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్
ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, కర్ణాటకలో అసెంబ్లీ
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు
చేసిందని అన్నారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో జరిగిన ఈ సదస్సులో కొంత మంది
భౌతికంగా, మరికొందరు ఆన్లైన్లో పాల్గొన్నారు. ”సామాజిక న్యాయ కోసం జరిగే
పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లటం, సామాజిక న్యాయం సాధనకు జాతీయ సంయుక్త
కార్యక్రమం” అనే అంశంపై ఏర్పాటు చేసిన ఈ సదస్సులో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె
స్టాలిన్ అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సదస్సులో మొత్తం 20 రాజకీయ పార్టీల
ప్రతినిధులు, మేధావులు, సీనియర్ పాత్రికేయులు ప్రసంగించారు. వీరిలో ఎంపి పి.
విల్సన్ (డిఎంకె), డెరెక్ ఓబ్రెయిన్ (టిఎంసి), ఛగన్ భుజ్బాల్
(ఎన్‌సిపి), ఈటి. మహ్మద్ బహీర్ (ఐయుఎంఎల్), మనోజ్ కుమార్ ఝా (ఆర్జెడి),
సంజరు సింగ్ (ఆప్), రాజ్‌కుమార్ సైనీ (ఎల్ఎస్పి), మహాదేవ్ జంకర్
(ఆర్ఎస్పి), వీరప్ప మొయిలీ (కాంగ్రెస్), మిగతా 5లో వి.తిరుమలవన్ (వికెసి),
వైకో (ఎండిఎంకె), దేవరాజన్ (ఫార్వర్డ్ బ్లాక్)తో బాటు పిఎజిఎఎఎఎం జాతీయ
కన్వీనర్ బిఎన్ వాఘా, ఎఐఎఫ్ఒబిసిఈడబ్ల్యుఎ ప్రధాన కార్యదర్శి జి.కరుణానిధి,
బిఎఎంసిఈఎఫ్ అధ్యక్షుడు వామన్ మేష్రామ్, పిపిఐడి నేత బి.డి బ్రోకర్,
రాజ్యాంగ పరిరక్షణ సంఘర్ష సమితి కన్వీనర్ అనిల్ జైహింద్, పివిఎస్ఎస్ఎం
ఆర్గనైజర్ బహుదూర్ సింగ్ లోథి, ద్రావిడర్ ఖజగం అధ్యక్షుడు కె.వీరమణి,
ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్లు లక్ష్మణ్ యాదవ్, రతన్ లాల్, సూరజ్
మండల్, సీనియర్ జర్నలిస్టులు దిలీప్ మండల్ ఉన్నారు.
తొలుత స్టాలిన్ మాట్లాడుతూ ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని,
అలాగని కొన్ని రాష్ట్రాలకు సంబంధించినది కాదని, సామాజిక న్యాయం అన్ని
రాష్ట్రాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. భారత సమాజం నిర్మాణంతో కలిసి
ఉందని తెలిపారు. కులాలు, వర్గాల సమస్యల పట్ల రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు
ఉండొచ్చు, కాని కుల వివక్ష అనేది ముఖ్యమైన అంశమని అన్నారు. వివక్ష,
అంటరానితనం, బానిసత్వం, అన్యాయం వంటి విషానికి సామాజిక న్యాయమే విరుగుడు అని
పేర్కొన్నారు. సామాజిక న్యాయంలో భాగంగానే రిజర్వేషన్లు వచ్చాయని తెలిపారు.
బిజెపి ఎస్డబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తుందని, ఇది సామాజిక న్యాయం
కాదని అన్నారు. పేదలకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే, దాన్ని ఆర్థిక
న్యాయమంటారని, సామాజిక న్యాయం కాదని తెలిపారు. కొంత మంది పేదలు, అన్ని
కులాల్లో పేదలతో సమానం కాదని అన్నారు. ఎస్సి, ఎస్టి, ఒబిసిల్లో పేదలు
ఆర్థిక, సామాజిక అణచివేతకు గురవుతున్నారని తెలిపారు. రిజర్వేషన్ ప్రతిభకు
వ్యతిరేకమని చెప్పిన బిజెపి, ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తుందని
ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న బిజెపి, 10 శాతం ఈడబ్ల్యుఎస్
రిజర్వేషన్ తీసుకురావడంలో లాజిక్ ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రతిభకు
వ్యతిరేకం కాదా? అని ప్రశ్నించారు.