కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వారి మద్దతు ఎవరికో?
కర్ణాటకలో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్న లింగాయత్‌లు అసెంబ్లీ ఎన్నికల్లో
పార్టీల గెలుపోటములను శాసిస్తారు. ఆ రాష్ట్రంలోని మొత్తం 224 నియోజకవర్గాల్లో
వంద స్థానాల్లో వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కర్ణాటకను ఏలిన 23 మంది
సీఎంలలో పది మంది లింగాయత్ వర్గానికి చెందిన వారే. 1989 వరకు కాంగ్రెస్‌కు
ప్రధాన ఓటు బ్యాంక్‌గా ఉన్న లింగాయత్‌లు ఆ తర్వాత బీజేపీ వైపు మొగ్గారు.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌లను ప్రసన్నం చేసుకునేందుకు అటు
బీజేపీ, ఇటు కాంగ్రెస్ పోటీపడుతున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గెలుపోటముల్లో కులానిది ఎప్పుడూ కీలక పాత్రే.
ముఖ్యంగా ఆ రాష్ట్ర జనాభాలో 17 శాతంగా ఉన్న లింగాయత్‌లు మొత్తం 224 నియోజక
వర్గాల్లోని దాదాపు వంద నియోజకవర్గాల్లో ఫలితాలను శాసిస్తారు. కర్ణాటక సామాజిక
చరిత్రలో లింగాయత్‌లకు ముఖ్యమైన స్థానముంది. మిగిలిన సామాజిక వర్గాలను
పరిశీలిస్తే వక్కలిగలు 15 శాతం, ఓబీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలు 18 శాతం,
ముస్లింలు 12.92 శాతం, బ్రాహ్మణులు 3 శాతంగా ఉన్నారు. ఐతే 2013 నుంచి 2018
వరకు కర్ణాటకలో నిర్వహించిన కులాల వారీ జనాభా లెక్కల ప్రకారం లింగాయత్‌లు 9
శాతం, వక్కలిగలు 8 శాతానికి పరిమితమైనట్లు సమాచారం. ఈ నివేదిక ఇంకా బయటకు
రాలేదు.
2023లింగాయత్ సామాజిక వర్గంలో మఠాలది కూడా కీలక పాత్ర. కర్ణాటక వ్యాప్తంగా
ఉన్న పలు లింగాయత్ మఠాలు రాజకీయంగా ప్రభావితం చేస్తాయి. లింగాయత్‌లలో ఉండే ఉప
కులాలదీ ముఖ్య భూమికే. యడియూరప్ప బనాజిగ ఉప కులానికి, బొమ్మై సదర్ ఉపకులానికి
చెందిన వారు. లింగాయత్‌లలో అధిక సంఖ్యలో ఉండే ఉప కులం పంచమసాలీలు.. దర్శి బసవ
జయ మృత్యుంజయ స్వామీజీ నాయకత్వంలో ఉంటారు. విద్య, ఉద్యోగాల్లో తమకు
రిజర్వేషన్లను పెంచాలని కోరుతూ ఇటీవల వారు ఆందోళన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆ
ఆందోళనకు దిగొచ్చిన భాజపా సర్కారు రాష్ట్ర ఓబీసీ జాబితాలో లింగాయత్‌లకు ఉన్న
రిజర్వేషన్‌ను మరో 2 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి
లింగాయత్‌లు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.