అస్సాంలో బెంగాల్ సంతతికి చెందిన ముస్లింలు ‘మియా మ్యూజియం’ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి హాని లేదని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు రిపున్ బోరా శుక్రవారం వాదించారు. రాష్ట్ర సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తోందన్నారు. మ్యూజియం ఎవరికీ హాని కలిగించదని బోరా ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో అన్నారు. గోల్పరా జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద కేటాయించిన ఇంట్లో ఏర్పాటు చేసిన వివాదాస్పద ‘మియా మ్యూజియం’ పై మంగళవారం ఆయన పై విధంగా స్పందించారు.