గుజరాత్లోని అమ్రేలీ జిల్లా చలాలా గ్రామంలో రెండు ఎద్దులు హల్ చల్ చేశాయి.
ఏకంగా వివాహం జరిగే కల్యాణ మండపంలోకి వచ్చి పొట్లాడుకున్నాయి. ఈ ఘర్షణతో
మండపంలోని నూతన వధూవరులతో పాటు అతిథులందరూ కంగుతిన్నారు. సుమారు 30
నిమిషాలపాటు బసవన్నలు కొట్లాడుకున్నాయి. దీంతో అరగంట సేపు పెళ్లి క్రతువు
ఆగిపోయింది. ఈ దృశ్యాన్ని పెళ్లికి వచ్చిన వారు మొబైళ్లలో చిత్రీకరించారు.
చివరకు ఎద్దులు శాంతించి వెనుదిరగడంతో తిరిగి పెళ్లి క్రతువు ప్రారంభమైంది.
నవ దంపతులిద్దరూ ఒక్కటయ్యారు. ఈ ఎద్దుల పోరాటానికి సంబంధించిన వీడియో
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.