భారత్‌కే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
అహ్మాదాబాద్: ఆస్ట్రేలియా(Australia), ఇండియా(India) అహ్మాదాబాద్‌లో మధ్య
జరిగిన నాలుగవ టెస్టు డ్రా(draw)గా ముగిసింది. ఆట చివరి రోజున టీ బ్రేక్
తర్వాత ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా
సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. ఆ దశలో
ఇద్దరు కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. మ్యాచ్ డ్రా కావడంతో.. టెస్టు
సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ వశం చేసుకున్నది. దీంతో బోర్డర్-గవాస్కర్
ట్రోఫీ(border gavaskar trophy) ఇండియాకే దక్కింది.
తొలి మూడు టెస్టులు మూడేసి రోజుల్లోనే ముగిసినా.. నాలుగో టెస్టులో మాత్రం
అయిదు రోజుల్లో కేవలం 20 వికెట్లు మాత్రమే పడ్డాయి. ఇవాళ ఆట ఆగే సమయానికి
లబుషేన్ 63, స్మిత్ 10 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. అయితే ఇండియా,
ఆస్ట్రేలియా జట్లు మళ్లీ జూన్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్
చాంపియన్‌షిప్(WTC)లో పోటీపడనున్నాయి.
లంకతో జరిగిన తొలి టెస్టులో కివీస్(kiwis) గెలవడంతో.. డబ్ల్యూటీసీ
ఫైనల్లోకి ఇండియా లైన్ క్లియరైంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్
ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధించడం ఇది వరుసగా రెండోసారి.