న్యూఢిల్లీ : వైద్య, ఆరోగ్య రంగంలో విదేశాలపై ఆధారపడకుండా ఆత్మనిర్భరత సాధనకు
కేంద్రం నిరంతర ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కొవిడ్
తీవ్రత గరిష్ఠస్థాయికి చేరిన సమయంలో ప్రాణాధార ఔషధాలు, టీకాలు, వైద్య పరికరాలు
ఆయుధాలుగా మారాయని గుర్తుచేశారు. ఆ నేపథ్యంలో ఇకపై ఆరోగ్య రంగంలో విదేశాలపై
ఆధారపడకూడదనే సంకల్పం తీసుకున్నామని చెప్పారు. అనేక దశాబ్దాలుగా ఆరోగ్య రంగంపై
దీర్ఘకాలిక దృష్టి, సమగ్ర దృక్పథం లేవనీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
దీనిని ఆరోగ్య మంత్రిత్వశాఖకే వదిలేయకుండా యావత్ ప్రభుత్వ అంశంగా తీసుకుంటూ
వచ్చామని వివరించారు. ‘ఆరోగ్యం, వైద్య పరిశోధనలు’ రంగంపై వెబినార్‌లో మోదీ
మాట్లాడారు. దేశంలో ఔషధ రంగ విపణి రూ.4 లక్షల కోట్లుగా ఉందని, పరిశోధకులు,
ప్రైవేటు రంగం మరింత సమన్వయంతో ముందుకు వెళ్తే రూ.10 లక్షల కోట్ల మార్కెట్‌ను
సాధించగలమని ఆశాభావం వ్యక్తపరిచారు. పేదలకు వైద్య ఖర్చును అందుబాటులోకి
తీసుకురావడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.పేద ప్రజలకు రూ.లక్ష కోట్లు ఆదా : ఆయుష్మాన్ భారత్, జనఔషధి కేంద్రాల ద్వారా
పేద, మధ్యతరగతి ప్రజలకు రూ.లక్ష కోట్లు ఆదా అయ్యాయని ప్రధాని గుర్తుచేశారు.
మంగళవారం జన్ ఔషధి దివస్ జరగనున్న విషయాన్ని గుర్తుచేశారు. 1.5 లక్షల ఆరోగ్య
కేంద్రాలను జనావాసాలకు సమీపంలో ఏర్పాటు చేశామని, వీటిలో మధుమేహం, క్యాన్సర్,
గుండెజబ్బు సంబంధిత పరీక్షలూ నిర్వహిస్తారని తెలిపారు. ఆరోగ్య రంగానికి
ప్రభుత్వ సహకారం గురించి మాట్లాడుతూ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ)
రూపంలో రూ.30 వేల కోట్లకు పైగా మొత్తాన్ని అందుబాటులో ఉంచామని తెలిపారు. వైద్య
పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలను యువత ఒడిసిపట్టుకోవాలని సూచించారు. యువతలో
నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా మాత్రమే ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక
వ్యవస్థగా మనదేశం మారుతుందని ప్రధాని స్పష్టంచేశారు. గుజరాత్లో జరిగిన
‘ఉద్యోగ మేళా’లో దృశ్యమాధ్యమ విధానం ద్వారా ఆయన పాల్గొన్నారు.