న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ కింద రూ. 16,800 కోట్లు
విడుదల చేయడాన్ని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్లో
కొనియాడారు. పీఎం కిసాన్‌పై ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. కేంద్ర
ప్రభుత్వం ఈ పథకం కింద ఇస్తున్న రూ. 6,000కు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.
7,500ను కలిపి అందజేస్తూ వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్‌గా ప్రచారం
చేసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెనాలిలో మంగళవారం దీనికి
సంబంధించిన నిధులు విడుదల చేశారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి కేవలం పీఎం
కిసాన్‌పై ట్వీట్ చేయడం విశేషం. ఈ పథకం కింద ఎనిమిది కోట్లకు పైగా రైతులు
ఏడాదికి రూ. 6,000 చొప్పున అందుకుంటున్నారని తెలిపారు. వ్యవసాయ రంగానికి ఇది
గొప్ప సహాయకారిగా నిలుస్తోందన్నారు. ప్రధాని మానస పుత్రిక అయిన ఈ పథకాన్ని
తాను అభినందిస్తున్నానని పేర్కొన్నారు.