సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం
డిస్మిస్ చేసింది. ఈకేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును
సమర్థించింది. పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తనకు బెయిల్ మంజూరు
చేస్తూ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సెషన్స్ కోర్టులో
పోలీసులు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌కు ఎలాంటి విచారణార్హత లేదంటూ నారాయణ
విద్యా సంస్థల అధినేత, టీడీపీకి చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ చేసిన
వాదనను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. సెషన్స్ కోర్టు ముందు పోలీసులు
రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం సరైందేనని, ఆ పిటిషన్‌కు విచారణార్హత ఉందని
హైకోర్టు స్పష్టంచేసింది. అయితే నారాయణకు మేజిస్ట్రేట్ ఇచ్చిన బెయిల్‌ను
రద్దుచేస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దుచేసింది.
సెషన్స్ కోర్టు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే మేజిస్ట్రేట్ కోర్టు
ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను రద్దుచేసిందని తెలిపిన హైకోర్టు, తిరిగి కేసు
పూర్వాపరాలన్నింటినీ విచారించి వాటి ఆధారంగా నిర్ణయం వెలువరించాలని సెషన్స్
కోర్టును ఆదేశించింది.అసలు ఏం జరిగిందంటే : పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నారాయణను
అరెస్టుచేసిన పోలీసులు అతన్ని చిత్తూరు మేజిస్ట్రేట్ కోర్టు ముందు
హాజరుపరిచారు. అయితే, నారాయణ రిమాండ్‌ను మేజిస్ట్రేట్ తిరస్కరిస్తూ
ఉత్తర్వులిచ్చారు. తద్వారా నారాయణ బెయిల్‌పై విడుదలయ్యారు. దీనిపై పోలీసులు
సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన
సెషన్స్ కోర్టు.. నారాయణకు బెయిల్ ఉత్తర్వులను రద్దుచేసి ఆయన కోర్టులో
లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఈ
ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు
చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు విచారణ
జరిపారు.
అదనపు ఏజీ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి : మేజిస్ట్రేట్ రిమాండ్‌ను
తిరస్కరించినప్పుడు దానిపై సెషన్స్ కోర్టులో రివిజన్ దాఖలు చేయవచ్చునని,
దానికి విచారణార్హత ఉందన్న అదనపు ఏజీ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. అయితే,
పోలీసులకు తమ వాదన వినిపించే అవకాశం మేజిస్ట్రేట్ కోర్టు ఇవ్వలేదని, అందువల్ల
నారాయణ రిమాండ్‌ను తిరస్కరిస్తూ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులను
రద్దుచేస్తున్నట్లు సెషన్స్ జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని న్యాయమూర్తి
తప్పుపట్టారు. కానీ, మేజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించేందుకు పబ్లిక్
ప్రాసిక్యూటర్ (పీపీ) నిరాకరించారని, దీంతో ప్రభుత్వం పీపీపై చర్యలకు
ఉపక్రమించిందని న్యాయమూర్తి గుర్తుచేశారు. అంతేకాక మేజిస్ట్రేట్ తన ముందున్న
ఆధారాలను బట్టే నారాయణ రిమాండ్‌ను తిరస్కరించారా? అన్న విషయాన్ని కూడా
సెషన్స్ కోర్టు పరిశీలించలేదన్నారు. అందువల్ల నారాయణ రిమాండ్‌ను తిరస్కరిస్తూ
మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన
ఉత్తర్వులను రద్దుచేస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.