బీజేపీ మేఘాలయ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మావ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో
గొడ్డు మాంసం తినే విషయమై ఎలాంటి నియంత్రణల్లేవని వ్యాఖ్యానించారు. బీజేపీ ఏ
కులం లేదా జాతి, మతాన్ని చూడదన్నారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తాను సైతం
గొడ్డు మాంసం తింటానని ప్రకటించారు. ఈ విషయంలో పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని
స్పష్టం చేశారు. బీజేపీలో ప్రతి ఒక్కరూ తమకు కావాల్సింది తినే స్వేచ్ఛ కలిగి
ఉన్నారని మావ్రీ అన్నారు. ఇది ఆహార అలవాటు అని, దీంతో ఓ రాజకీయ పార్టీకి
ఎందుకు ఇబ్బంది ఉండాలి? అని ప్రశ్నించారు. మేఘాలయలో ప్రతి ఒక్కరూ గొడ్డు మాంసం
తింటారని, రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు, నియంత్రణల్లేవని స్పష్టం చేశారు. ‘‘ఇది
మా అలవాటు, మా సంస్కృతి’’ అని మావ్రీ అన్నారు. గోవధ అంశంపై మాట్లాడుతూ.. తమ
సొంత ఆహార అలవాట్లనే అనుసరిస్తామని, దీనిపై ఎలాంటి నిషేధం లేదని, ఈ దిశగా తమకు
ఎలాంటి ఆదేశాల్లేవని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం
సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కనీసం 34 స్థానాలు గెలుచుకుంటామన్నారు.