న్యూఢిల్లీ : పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులకు ఎలాంటి ప్రయోజనాలను
కల్పించకూడదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా
ఉద్ఘాటించారు. అటువంటి ప్రయోజనాలతో కూడిన స్వతంత్ర న్యాయ వ్యవస్థ మనకు
అక్కర్లేదని పేర్కొన్నారు. ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వతంత్ర
న్యాయమూర్తుల అవసరం ఉన్నదని, ఇలాంటి న్యాయమూర్తులు తమంతట తాముగా నిలబడేలా
వెన్నెముకను కలిగి ఉండటంతోపాటు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని తెలిపారు.