న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో మొబైల్స్, టీవీలు, కెమెరాల విడిభాగాల
దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది కేంద్రం. దీంతో మొబైల్స్, టీవీలు
మరింత తక్కువ ధరకే లభించ నున్నాయి. సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీని 16 శాతానికి
పెంచింది కేంద్రం. టీవీ, కెమెరాలు, మొబైల్ కొనుగోలుదారులకు కేంద్రం ఊరట
కల్పించింది. ఈ మూడింటి విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. దీంతో
టీవీ, మొబైల్స్ మరింత చౌకగా కొనుగోలుదారులకు లభించనున్నాయి. సిగరెట్లపై
కస్టమ్స్ కస్టమ్స్ డ్యూటీని 16 శాతం పెంచింది కేంద్రం. ఈ క్రమంలో సిగరెట్
రేట్లు మరింత పెరగనున్నాయి. గోల్డ్, ప్లాటినం బార్స్ నుంచి చేసే ఆభరణాలపై
కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్. ఎగుమతులను ప్రోత్సహించేందుకు రొయ్యల ఫీడ్‌పై కస్టమ్స్ సుంకాన్ని
తగ్గించినట్లు పేర్కొన్నారు.
ధరలు తగ్గేవి : టీవీలు, కెమెరాలు, మొబైల్స్
పెరిగేవి : సిగరెట్లు, వెండి, బంగారం, వజ్రాలు