నోబెల్ విజేత, ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్ భూకబ్జా ఆరోపణలు
ఎదుర్కొంటుండడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.
అమర్త్యసేన్ కు ఆమె మద్దతుగా నిలిచారు. అమర్త్యసేన్ తమ భూమిని ఆక్రమించారంటూ
విశ్వభారతి యూనివర్సిటీ ఆరోపిస్తోంది. ఆ భూమిని తిరిగి ఇచ్చేయాలంటూ వర్సిటీ
యాజమాన్యం అమర్త్యసేన్ కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో బిర్భూమ్ లోని పూర్వీకుల
ఇంట్లో ఉన్న అమర్త్యసేన్ ను మమతా బెనర్జీ కలిశారు. ఈ సందర్భంగా ఆమె
మాట్లాడుతూ, అమర్త్యసేన్ వంటి వ్యక్తిని బీజేపీ ఈ విధంగా అవమానించడం సరికాదని
హితవు పలికారు.
“అమర్త్యసేన్ ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇలాంటి
ప్రయత్నాలు చేస్తారా? కాషాయీకరణ పోకడలకు పోకుండా, విశ్వభారతి యాజమాన్యం సరైన
పంథాలో నడవాలని కోరుకుంటున్నాను” అని మమతా బెనర్జీ తెలిపారు.